Posts

ఆర్థిక చక్రబంధం

  నరేంద్ర మోడీ పాలనలో దేశం అన్ని వైపులా ఆర్థికంగా దిగజారుతున్న తీరు దిగ్భ్రాంతి కలిగిస్తోంది. కీలక సూచీలన్నీ గతంలో ఎన్నడూ లేని విధంగా పతనమౌతున్నాయి. అదే సమయంలో ద్రవ్యోల్బణం దౌడుతీస్తోంది. ఫలితంగా నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలను దాటి పరుగులు తీస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ప్రజానీకం జీవనం దుర్భరంగా మారుతున్నా సామాన్యులను దోచి కార్పొరేట్లకు పందారం చేసే మోడీ ప్రభుత్వ వైఖరిలో ఇసుమంత కూడా మార్పు రావడం లేదు. గ్యాస్‌ సిలిండర్‌ ధర 50 రూపాయలు పెంచి, సామాన్యులపై పెనుభారం మోపిన తాజా నిర్ణయం ఇటువంటిదే. ప్రజల కొనుగోలు శక్తి రోజురోజుకి తగ్గుతోంది. ఇది వివిధ రకాల వస్తు, సేవల ఉత్పత్తులపై పడుతోంది. మార్కెట్‌ తగినంతగా లేకపోవడంతో పరిశ్రమలు మూతపడటమో, ఉత్పత్తులను తగ్గించుకోవడమో చేయక తప్పని స్థితి ఏర్పడుతోంది. దీంతో కొత్త ఉద్యోగ ఉపాధి అవకాశాల సంగతి ఎలా ఉన్నప్పటికీ, ఉన్న ఉద్యోగాలే ఊడుతున్నాయి. ఫలితంగా నిరుద్యోగం గతంలో ఎన్నడూ లేనంత స్థాయికి చేరింది. నిజవేతనాల స్థాయి గణనీయంగా పడిపోయింది. ప్రజానీకం, ముఖ్యంగా యువత అభద్రతతో కొట్టుమిట్టాడుతుంటే, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు లాభాలను వెతుక్కుంటూ తమ మదుపులను ఇతర...